సీతక్క నోరు అదుపులో పెట్టుకోవాలి
- కేసీఆర్‌కు లీగల్ నోటీసుతో డైవర్షన్ రాజకీయాలు
- మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
మహబూబాబాద్, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): మంత్రి సీతక్క ముందుగా నోరు అదుపులో పెట్టుకోవాలి, సంబంధంలేని విషయాల్లో కేసీఆర్ కు లీగల్ నోటీస్ పంపి సీతక్క డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ కు సీతక్క లీగల్ నోటీసులు మంత్రి సీతక్క పంపడం చాల సిగ్గు చేటన్నారు.
సీతక్క కేసిఆర్, కేటీఆర్ పై ఆనేక ఆరోపణలు చేస్తే ఆమె చేసిన అవినీతి మాసిపోతుందా అని ప్రశ్నించారు. సెల్ ఫోన్ల కొనుగోలు కుంభకోణం చేసిన మంత్రి సీతక్క నోరు ఆదుపులో పెట్టుకోవాలన్నారు. కాంగ్రెస్ నేతలకు అవినీతి తప్ప, అభివృద్ధి చేతకాదన్నారు. 38 వేల ఫోన్లు అంగన్ వాడీలకు ఇచ్చి 6వేల ధర ఉన్న ఫోనుకు 14 వేలు పెట్టి కొన్నట్లు చూపడం అవినీతి కాదా అని ప్రశ్నించారు. సీతక్క అవినీతికి పాల్పడకపోతే ఫోన్ల కొనుగోలుపై విచారణ చేపించాలన్నారు.
మహిళ మంత్రిగా ఉండి మాట్లాడే మాటలూ ఇవేనా సీతక్క అంటూ ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ పార్టీ మహిళా కార్యకర్తల దగ్గర చాల చెప్పులు ఉన్నాయి..మేము మీ కంటే ఎక్కువగా మాట్లాడగలం అని సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. 4జీ ఫోన్ ఇచ్చి 5జీ ఫోన్ గా ప్రచారం చేసుకోవడం ఎంతవరకు సబబో మంత్రి సీతక్క చెప్పాలన్నారు. అదివాసి బిడ్డ ఐతే ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతావా సీతక్క, ఓక్క మహిళను ఐనా కోటీశ్వరురాలిగా మార్చావా సీతక్క అంటూ సత్యవతి రాథోడ్ ప్రశ్నించారు.
కాంగ్రెస్ పాలన మొత్తము స్కాం ల మయమని, నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అనేలా ఉంది ప్రభుత్వ తీరు మారిందని విమర్శించారు. సీతక్క చేతలకు, మాటలకు సంభందం లేదన్నారు. కేసీఆర్ హయాంలో శిశు సంక్షేమ శాఖ దేశంలో ముందు వరుసలో ఉంటే..మీ ప్రభుత్వం లో కుళ్ళిన గుడ్లు ఇస్తుంది మీరు కదా.. అంటూ దివ్య బట్టారు.
ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టకుండా ప్రతి ప్రభుత్వ పథకంలో, ప్రతి స్కీములో స్కాములు చేసుకుంటూ రాష్ట్రాన్ని బ్రష్టు పట్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు తొందర్లోనే సాగనంపడం ఖాయమని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంత్రి సీతక్క క్షమాపణ చెప్పాలని సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు.






