15 April, 2026 | 2:59 AM

పోలీసుల అదుపులో చికెన్ సెంటర్ యజమాని?

15-04-2026 12:26 AM
  1. ఆర్టీసీ టికెట్ల రోల్స్‌పై కొనుగోలుదారులకు బిల్లులు
  2. హుస్నాబాద్ డిపో అధికారులకు ఫిర్యాదు

హుస్నాబాద్, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): హుస్నాబాద్ పట్టణంలో ఆర్టీసీ టికెట్ రోల్‌ను వినియోగించి చికెన్ సెంటర్‌లో బిల్లులు ఇవ్వడం సంచలనంగా మారింది. గాంధీ విగ్రహం సమీ పంలో ఉన్న ఓ చికెన్ సెంటర్‌లో, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులకు ఇచ్చే టికెట్లకు సంబంధించిన రోల్స్‌పై చికెన్ కొనుగోలుదారులకు బిల్లులు ముద్రించి ఇవ్వ డం బయటపడింది.

ఈ విషయంపై హు స్నాబాద్ ఆర్టీసీ డిపో అధికారులు ఫిర్యా దు చేయడంతో పోలీసులు వెంటనే స్పందించారు. సంబంధిత చికెన్ సెంట ర్ యజమాని అశ్రఫ్‌ను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నట్లు స మాచారం.ఈ టికెట్ రోల్స్ అతని వద్దకు ఎలా చేరాయి? దీనికి మరెవరైనా సం బంధం ఉందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ప్రభు త్వ సంస్థకు చెందిన వస్తువులను అక్రమంగా వినియోగించడంపై కఠిన చర్య లు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ఘటనతో ఆర్టీసీ టికెట్ వ్యవ స్థలో ఉన్న లోపాలు కూడా బయటపడుతున్నాయని అభిప్రాయాలు వ్యక్తమ వుతున్నాయి.