20 August, 2026 | 2:44 AM

మంగళ్‌పల్లి చౌరస్తాలో ఆక్రమణల తొలగింపు

20-08-2026 12:05 AM

ఆదిభట్ల, ఆగస్టు 19 (విజయక్రాంతి): ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని మంగళ్పల్లి చౌరస్తాలో ప్రధాన రహదారిపై ఆక్రమణలను అధికారులు బుధవారం తొలగిం చారు. టౌన్ప్లానింగ్ అధికారి రఘునాథ్ ఆధ్వర్యంలో ఈ చర్యలు చేపట్టారు. ఆక్రమణలతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నా యన్న ఫిర్యాదులపై అధికారులు స్పందించారు. రోడ్డును ఆక్రమించి ఏర్పాటు చేసిన నిర్మాణాలను తొలగించారు. కొంతమంది స్థానికులు, వ్యాపారులు చర్యలను వ్యతిరేకించినా అధికారులు కూల్చివేతలను కొన సాగించారు. 

రహదారులపై ఆక్రమణలను సహించబోమని అధికారులు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్లు, ఫుట్పాత్లు ప్రజల వినియోగానికే ఉండాలని పేర్కొన్నారు. అయితే, రోడ్డుకు ఇరువైపులా ఉన్న అన్ని ఆక్రమణలపై సమానంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.