29 August, 2026 | 4:05 PM

విద్యుత్ లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు

29-08-2026 03:28 PM

చర్లగార్లపాడు సర్పంచ్ జి. రాముడు ముందస్తు చర్యలు

మల్దకల్, ఆగస్టు 29,(విజయక్రాంతి): చర్లగార్లపాడు గ్రామంలో వర్షాకాలం, గాలివానల నేపథ్యంలో విద్యుత్ లైన్లకు అడ్డుగా పెరిగిన చెట్ల కొమ్మలను సర్పంచ్ జి. రాముడు ప్రత్యేక చొరవతో తొలగించారు. పంచాయతీ సిబ్బందితో కలిసి పనులను పర్యవేక్షించారు. గాలివానల సమయంలో కొమ్మలు విద్యుత్ తీగలకు తగిలి ప్రమాదాలు జరగకుండా, నిరంతర విద్యుత్ సరఫరా కోసం ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రజల భద్రత, గ్రామాభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని సర్పంచ్ రాముడు పేర్కొన్నారు.