18-07-2025 12:00:00 AM
సూర్యాపేట, జూలై 17 (విజయక్రాంతి) : పట్టణంలోని 10 వ వార్డులోని కుప్పిరెడ్డిగూడెం సర్వే నెంబర్ 62/ఏ.ఏ 2లోని 0 _ 36 ఎకరాలలో ఏర్పాటు చేస్తున్న వెంచర్, 2వ వార్డులోని కోమటికుంట సర్వే నెంబర్ 240లో 1.5 ఎకరాలలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేస్తున్న వెంచర్ లను మున్సిపల్ కమీషనర్ సి.ఎచ్. హన్మంతరెడ్డి ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ సిబ్బంది గురువారం జేసీబీ సహాయంతో తొలిగించారు.
ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ పట్టణంలో మున్సిపల్ అనుమతి లేకుండా వెంచర్లు చేయొద్దన్నారు. అనుమతి లేని వెంచర్లలో ప్రజలు ప్లాట్లు కొంటె మున్సిపాలిటీ నుండి భవన నిర్మాణములు అనుమతి ఇవ్వబడవని, నల్లా కనెక్షన్ లు ,అభివృద్ధి పనులు రోడ్లు, మురికి కాలువలు , వీధి దీపములు ఏర్పాటు చేయబడమన్నారు. కావున ,ప్రజలు ఈ విషయాన్నీ గమనించాలన్నారు,ఈ కార్యక్రమంలో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి ఉయ్యాల సోమయ్య ,బి.ఐ లు అఖిల్ ,శివాజీ ,రెహ్మాన్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.