17-07-2025 11:10:01 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): మూసివేత దశ నుంచి 27 మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాల నుండి ప్రభుత్వ పాఠశాలలో చేరిన సందర్భంగా, వారికి ప్రోత్సాహకంగా టై, బెల్టుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కురవి మండలం ఖాసీంతండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు గుడ్ ఫ్రెండ్స్ తోలేం వెంకటేశ్వర్లు, బి. కిషన్ (పీసీ) సహకారం తో విద్యార్థులకు టై బెల్టులు అందజేశారు. పాఠశాల పునరుద్ధరణకు కృషిచేసిన హెడ్మాస్టర్ మంజుల, టీచర్ మాధవి కృషిని అభినందించారు.