18-02-2026 12:00:00 AM
ఘట్ కేసర్, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): మల్కాజిగిరి నగరపా లక సంస్థ, ఉప్పల్ జోన్ పరిధిలోని ఘట్కేసర్ సర్కిల్ లోని డివిజన్5 నాగారం, డివిజన్6 ఘట్ కేసర్, డివిజన్7 ఎదులాబాద్, డివిజన్8 పోచారం ప్రాంతాల్లో వర్షాకాలంలో వరదకు గురై ముప్పు ప్రాంతాల్లో ఉన్న నాలలోనీ కూడికలు, పిచ్చి మొక్కలను తొలగింపు జరుగుతున్న పనులను ఘట్ కేసర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వాణి రెడ్డి మంగళవారం పర్యవేక్షించారు.
నాలలో ఉన్న పూడిక, పిచ్చి మొక్కలను త్వరగా తొలగించి వర్షపు నీటికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వర్షపు నీరు సజావుగా వెళ్ళేటట్లు చెయ్యాలని సంబంధిత అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో ఇట్టి కార్యక్రమంలో డిఇఇ నరేష్ కుమార్, వర్క్ ఇన్ స్పెక్టర్ లు పాల్గొనడం జరిగింది.