calender_icon.png 5 July, 2025 | 11:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేవైసీని పునరుద్ధరించుకోండి

03-07-2025 02:26:46 AM

కస్టమర్లకు యూనియన్ బ్యాంక్ సూచన

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 2 (విజయక్రాంతి): కేవైసీని పునరుద్ధరించుకో వాలని యూనియన్ బ్యాంక్ తన ఖాతాదారులకు సూచన చేసింది. ఆర్బీ మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఖాతాను తక్కువ, మధ్యస్థ, అధిక రిస్క్‌గా వర్గీకరించినట్టు తెలిపింది. తక్కువ రిస్క్ కస్టమర్లు 10 సంవత్సరాల తర్వాత తమ కేవైసీని నవీకరించుకోవాలని సూచించింది.

మధ్యస్థ రిస్క్ కస్టమర్ ఎనిమిది సంవత్సరాల తర్వాత, అధిక -రిస్క్ కస్టమర్లు రెండు సంవత్సరాల తర్వాత కేవైసీని నవీకరించాలని చెప్పింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలోగానీ, మొబైల్ బ్యాంకింగ్ ద్వారాగానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ద్వారాకానీ, రీకేవైసీ పోర్టల్, కార్పొరేట్ వెబ్‌సైట్ ద్వారాగానీ, UVConn Whatsapp బ్యాంకింగ్ (966660 6060కి హాయ్ అని ఎస్‌ఎంఎస్ చేసిగానీ నవీకరించుకోవచ్చని తెలిపింది. లేదా దగ్గర్లోని బ్రాంచీలో సంప్రదించాలని సూచించింది.