calender_icon.png 5 July, 2025 | 6:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్ కమిషనర్ సాయి చైతన్యకు జగన్నాథ రథయాత్ర ఆహ్వానం

03-07-2025 02:24:33 AM

నిజామాబాద్ జూలై 2: (విజయ క్రాంతి): వచ్చే శుక్రవారం ఇస్కాన్ కంఠేశ్వర్ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించనున్న శ్రీ జగన్నాథ రథయాత్ర ఆహ్వానాన్ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య కు ఇస్కాన్ ప్రతినిధుల బృందం అందజేసింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇస్కాన్ కంఠేశ్వర్ కేంద్రం నిర్వహిస్తున్న సేవా మరియు శిక్షణ కార్యక్రమాలను అడిగి తెలుసుకుని ప్రత్యేకంగా అభినందించడం జరిగింది, వేసవి లో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరం యొక్క ముగింపు కార్యక్రమం సందర్భంగా ముఖ్య అతిథిగా వెళ్లిన సమయంలో ఎంతో ప్రశాంతత మరియు భక్తి అనుభూతి చెందినట్లు కమిషనర్ ఇస్కాన్ బృంద సభ్యుల కు ఆయన తెలిపారు.

జగన్నాథ రథయాత్ర వైభవోపేతంగా నిర్వహించడం కోసం తన యొక్క పూర్తి సహాయ సహకారాలు మరియు పోలీసు శాఖ తరపున కూడా పూర్తి సహకారాన్ని అందిస్తామని, ప్రశాంతమైన వాతావరణంలో రథయాత్రను జరుపుకోవాలని సిపి సూచించరూ.ఆహ్వానాన్ని అందించిన వారిలో ఇస్కాన్ కంటేశ్వర్ కేంద్రం అధ్యక్షులు రామానంద రాయ్ ప్రభుదాస్, స్వామి యాదవ్ మరియు కమిటీ సభ్యులు ఉన్నారు.