calender_icon.png 5 July, 2025 | 5:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డిలో పూరీ జగన్నాథ యాత్ర

03-07-2025 02:27:22 AM

ఇస్కాన్ ఆధ్వర్యంలో ఊరేగింపు , పోలీసుల భారీ బందోబస్తు 

కామారెడ్డి, జూలై 2 (విజయక్రాంతి), కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం పూరీ జగన్నాథ యాత్ర ఘనంగా నిర్వహించారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన వీధుల గుండా జగన్నాథ రథయాత్ర ను భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని నిర్వహించారు. పాత సాయిబాబా ఆలయం నుంచి ప్రారంభమైన రథయాత్ర నిజాంసాగర్ రోడ్, కొత్త బస్టాండ్ రోడ్, నిజాంసాగర్ చౌరస్తా, కమాన్ రోడ్, పాత బస్టాండ్ రోడ్, సిరిసిల్ల రోడ్,ల మీదుగా జేపీ అండ్ రోడ్, నుంచి రామారెడ్డి రోడ్లోని ఇస్కాన్ కృష్ణ మందిరం ఆలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణ ప్రముఖులు భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగన్నాథ్ యాత్ర గత మూడు సంవత్సరాలుగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.