calender_icon.png 12 November, 2025 | 8:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రంథాలయాన్ని తిరిగి తెరిపించండి

12-11-2025 07:15:00 PM

సదాశివనగర్ (విజయక్రాంతి): మండలంలోని బొంపల్లి గ్రామంలో గల గ్రంథాలయాన్ని తిరిగి తెరిపించాలని జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డికి గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. బొంపల్లి గ్రామంలో గల గ్రామీణ గ్రంధాలయాన్ని ఇటీవల మూసివేయడం జరిగిందని, తిరిగి తెరిపించాలని కోరుతు జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డిని మాజీ జెడ్పిటిసి రాజేశ్వర్ రావు, గ్రామస్తులతో కలిసి వినతి పత్రం అందజేశారు. ఎన్నో ఏళ్లుగా గ్రామీణ గ్రంథాలయం ఉండగా గత ఆరేళ్ల క్రితం గ్రంధ పాలకుడు మృతిచెందడంతో మూసివేసారని తెలిపారు. మళ్లీ గత చైర్మన్ పున్నా రాజేశ్వర్ హాయంలో పునరుద్ధరించారని, ఇటీవల దాన్ని మూసివేశారన్నారు.

అందుకు చైర్మన్ స్పందిస్తూ గ్రామపంచాయతీ నుంచి లెటర్ తీసుకొచ్చి తిరిగితేర్పిస్తామని నిరుద్యోగులకు విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగకుండా చూస్తామన్నారు. గ్రంధాలయం తెరిపించే బాధ్యత తీసుకుంటానని గ్రామ పెద్దలు యువత పెడదారిని పట్టకుండా గ్రంథాలయానికి తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాలని సూచించారు. త్వరలోనే గ్రామానికి వచ్చి గ్రామ పెద్దలు యువకులతో మాట్లాడి పునరుద్ధరించడానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్టు తెలిపారు. కార్యక్రమంలో పద్మాజివాడి సింగిల్ విండో చైర్మన్ గంగాధర్, దేవాలయ చైర్మన్ రాజిరెడ్డి, విఠల్రావు, బాలచంద్రన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.