calender_icon.png 12 November, 2025 | 8:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామచంద్రంకు అభినందనలు..

12-11-2025 07:10:48 PM

సుల్తానాబాద్ (విజయక్రాంతి): హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ రాష్ట్ర భాష, సాంస్కృతిక శాఖ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన అఖిల భారత సివిల్ సర్వీస్ సంగీతం, నృత్యం, నాటక పోటీలలో సుల్తానాబాద్ కు చెందిన స్కూల్ అసిస్టెంట్ లెక్కల ఉపాధ్యాయులు దర్శనాల రామచంద్రం ప్రశంస పత్రం అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా రామచంద్రంకు సుల్తానాబాద్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, పలువురు మిత్రులు బుధవారం హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.