calender_icon.png 12 November, 2025 | 8:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దివ్యాంగులు, వృద్ధుల సమస్యలకు ప్రత్యేక ప్రజావాణి

12-11-2025 07:18:02 PM

దరఖాస్తులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి..

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): వృద్ధులు, దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమంలో గతంలో వచ్చిన పెండింగ్ దరఖాస్తుల వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం అర్భన్ తహసిల్దార్ కార్యాలయంలో ప్రతినెలా మొదటి బుధవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం కొన్ని అనివార్య కారణాల వలన రెండవ బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ తో కలిసి ఆమె వృద్ధులు, దివ్యాంగుల సమస్యలను శ్రద్ధగా విని, ఫిర్యాదులను స్వీకరించి, మొదటి ప్రాధాన్యతగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు.

ఈ సందర్భంగా 20 మంది దివ్యాంగులు, 7 గురు వృద్ధులు తమ సమస్యల వినతీ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం పురస్కరించుకొని వారం రోజులు నిర్వహించే కార్యక్రమాల పోస్టర్ ను ఆమె ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి జరీనా బేగం, మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు జగపతిరావు, నాగభూషణం, రాజసింహుడు, శివ్వన్న పంతులు, అంజయ్యాచారి, పాండురంగం, నాగేంద్రస్వామి, తదితరులు పాల్గొన్నారు.