16 June, 2026 | 5:25 PM

గాయత్రి హోమంతో పాఠశాల పునఃప్రారంభం

16-06-2026 04:51 PM

ఇచ్చోడ,(విజయక్రాంతి): ఇచ్చోడ మండల కేంద్రము లోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో నూతన విద్యా సంవత్సరం (2026-27) ప్రారంభం సందర్భంగా విద్యార్థులకు మంచి చదువుతో పాటు చక్కని సంస్కారం అంది భవిష్యత్తు లో గొప్ప స్థాయికి ఎదగాలని సరస్వతీ దేవి, లక్ష్మీ దేవి ల కటాక్షం ఆశీస్సులు ఎల్లప్పుడూ విద్యార్థులపై ఉండాలని గాయత్రి హోమ యజ్ఞాన్ని నిర్వహించారు.

పాఠశాల ప్రభందకారిణి సభ్యులు, పోషకులు గట్ల శైలజ, శ్రీనివాస్ లు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు మంచి విద్యా బుద్దులు అలవడాలని ప్రతి సంవత్సరం సరస్వతీ శిశు మందిరాలలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా గాయత్రి యజ్ఞాన్ని నిర్వహిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానాచార్యులు సంతోష్ కుమార్, ఆచార్యులు ఉషారాణి, భారతి, సుజాత, మంజుల,కవిత, సిందుజ, పోషకులు,విద్యార్థులు పాల్గొన్నారు.