మ్యాన్ హోల్స్, సీసీ రోడ్డుకు ఇరువైపులా మరమ్మతులు
24-04-2026 12:05 AM
మేడ్చల్ అర్బన్ ఏప్రిల్ 23 (విజయక్రాంతి): ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని రాజబొల్లారం మున్సిపల్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం నుండి శ్రీ సీతారాముల ఆలయం వరకు మ్యాన్ హోల్స్ తో పాటు సిసి రోడ్డుకు ఇరువైపులా ఉన్నటు వంటి మట్టిని తొలగించి మరమ్మతులు చేయడం జరిగిందని స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ గుమ్మడిదల మహేశ్వరి రాజేష్ తెలియజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వార్డులో ఎలాంటి సమస్యలు నెలకొన్న తన దృష్టికి తీసుకురావాలని వార్డు ప్రజలను ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ రవీందర్ రెడ్డి.బిల్ కలెక్టర్ గువ్వ సురేష్.పంపు ఆపరేటర్ రాజు.వెంకటేష్ లతో పాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.






