24 April, 2026 | 1:33 AM

వ్యవసాయ వ్యర్ధాలతో పెల్లెట్స్ స్టవ్

24-04-2026 12:07 AM
  1. తక్కువ ఖర్చుతో పాటు పర్యావరణానికి తక్కువ నష్టం.
  2. బయోమాస్ పెల్లెట్స్ వాడుకలోకి వస్తే దేశానికి లక్షల కోట్లు ఆదా
  3. హోటల్స్ యజమానుల ఎదుట ప్రయోగించిన  చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి

చేవెళ్ళ ఏప్రిల్ 23 (విజయక్రాంతి): జేకేఎంఆర్ ఫౌండేషన్ యువత తయారు చేసిన వివిధ రకాల బయో బయోమాస్ పెల్లెట్ గ్యాసిఫైయర్ స్టవ్ వినియోగం గూర్చి స్థానిక రెస్టారెంట్, హోటల్స్, మెస్ ఓనర్స్ కు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా చూపించారు.

యుద్ధం వల్ల సంభవించిన ఎల్ పిజి కొరత దృష్టిలో ఉంచుకొని చిన్న ఫుడ్ బిజినెస్ వాళ్లకు జరుగుతున్న ఇబ్బంది తొలగించడానికి యుద్ధం మొదలైన మరుసటి రోజు నుంచే జేకేఎంఆర్ ఫౌండేషన్ టీం వివిధ రకాలుగా రీసెర్చ్ చేసి రూపొందించిన పెల్లెట్ స్టవ్ లను వాడడం వాటి ఉపయోగాన్ని తెలిపినారు. ఖర్చు గ్యాస్ కంటే తక్కువ అవుతుందన్నారు. పర్యావరణానికి తక్కువ నష్టం కలుగుతుంది.

పెల్లెట్స్ జొన్న సొప్ప, వరి పొట్టు, మక్క బుట్టలు, ఇతర వ్యవసాయ ఆధారిత మిగిలిపోయిన వ్యర్థాల నుండి తయారు అవుతాయి. మన దేశం లక్షలాది కోట్ల రూపాయలతో ఎల్ పిజి దిగుమతి చేసుకుంటుంది. బయోమాస్ పెల్లెట్స్ వాడుకలోకి వస్తే దేశానికి లక్ష కోట్ల సంపద మిగులుతుందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఎటువంటి విపత్తుల సమయంలో ఈ ఫౌండేషన్ తన బాధ్యతను నిర్వర్తిస్తుందని చెప్పారు.

కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కె.ఎస్ రత్నం, మున్సిపల్ బిజెపి ప్రెసిడెంట్ అనంతరెడ్డి, శంకర్పల్లి బిజెపి ప్రెసిడెంట్ దయాకర్ రెడ్డి, రామన్నగూడ కౌన్సిలర్ పెద్దోళ్ల దయాకర్, సత్యనారాయణ  శర్వలింగం, ప్రభాకర్ రెడ్డి, మాణిక్ రెడ్డి, వెంకట్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి, ఇంద్రసేన రెడ్డి వడ్ల నందు, శ్రీకాంత్ రెడ్డి గణేష్ విఠల్ రెడ్డి జేకేఎంఆర్ టీం సభ్యులు, స్థానిక హోటల్స్ యజమానులు పాల్గొన్నారు.