08-09-2025 01:02:58 AM
మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి
రామాయంపేట, సెప్టెంబర్ 7 :నిజాంపేట మండల పరిధిలోని తిప్పనగుళ్ల గ్రామంలో గల హైదర్ చెరువు కాలేశ్వరం ప్రాజెక్ట్ కెనాల్ కాలువను ఆదివారం మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి పరిశీలించారు. హైదర్ చెరువుకు కాలేశ్వరం ప్రాజెక్టు కెనాల్ ద్వారా సాగునీరు వచ్చేవని, గత మూడు సంవత్సరాల క్రితం పుష్కలంగా పంటలు పండేవన్నారు.
గత వారం రోజులుగా కు రిసిన భారీ వర్షాలకు కెనాల్ కాలువ తెగిపోవడంతో రైతుల పంట పొలాలు నీట మునిగి పంట నష్టం వాటిల్లింది. ఈ సందర్బంగా పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ భారీ వర్షాలకు హైదర్ చెరువు నుండి కెనాల్ కు నీళ్లు రివర్స్ పోవడం ద్వారా కాలువ తెగిపోవడం జరిగిందన్నారు. రై తుల పంట పొలాలు మునిగి పోవడమే కాకుండా చెరువులో నీళ్లు లేకుండా పోతున్నాయని ఆ రోపించారు.
ఇరిగేషన్ అధికారులకు అడిగితే మాకు సంబంధం లేదని కాలేశ్వరం ప్రాజెక్టు వాళ్లకు సంబంధం అనడంతో కాలేశ్వరం ప్రాజెక్ట్ అధికారులతో మాట్లాడి త్వరగా తెగిపోయిన కాలువ పనులను పునరుద్ధరించాలని సూచించారు.ఈ విషయాన్ని ప్రజావాణి ద్వారా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. భారీ వర్షాలకు బ్రిడ్జిలు కల్వర్టులు దెబ్బ తినడంతో రామాయంపేట నుండి సిద్దిపేటకు వెళ్లేదారిలో నందిగామ బ్రిడ్జి కృంగిపోవడంతో ప్రత్యామ్నాయంగా కల్వకుంట నుండి పులిమామిడి ప్రగతి ధర్మారం నుండి వెళ్లే పరిస్థితి నెలకొందన్నారు.
నిజాంపేట నుండి నస్కల్ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి బ్రిడ్జి కూలిపోయి వారం రోజులు గడుస్తున్నా అధికారులు ప ట్టించుకోవడం లేదని రెండు, మూడు రోజులలో దెబ్బతిన్న బ్రిడ్జి కల్వర్టుల పనులు ప్రారంభించక పోతే బిఆర్‌ఎస్ పార్టీ పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ గోపరి నర్సింలు,మాజీ కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ అజిజ్,మాజి సొసైటీ చైర్మన్ పప్పుల. కిష్టారె డ్డి, నాయకులు వెంకటస్వామి గౌడ్, రంజిత్ గౌడ్ ,నాయిని లక్ష్మణ్, నరేందర్ నాయక్, మొగులస్వామి, రమేష్, వెంకటరెడ్డి ఉన్నారు.