08-09-2025 12:59:50 AM
పూర్వ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి మద్దెల కమలాకర్
సిద్దిపేట, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): రెవెన్యూ శాఖలో 5,106 మందినీ గ్రామ పాలనాధికారులు (జీపీవో)లుగా ఎంపిక చేసి ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన సీఎం రేవంత్ రెడ్డికి పూర్వ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి మద్దెల కమలాకర్ కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం ఆయన సిద్దిపేటలో విలేకరులతో మాట్లాడుతూ ఉద్యోగాల్లో నియ మితులైన జీపీఓలు భూ సంబంధిత విధి నిర్వహణలో పారదర్శకతతో నిబద్ధతతో న్యాయబద్దం గా పని చేస్తానని ప్రతిజ్ఞ చేయించడానికి స్వాగతిస్తున్నామన్నారు.
కొత్తగా నియమితులైన జీపీవోల పట్ల తనకు సంపూర్ణమైన విశ్వాసం ఉందనీ సీఎం వెల్లడించడం అభినందనీయమన్నారు. తెలంగాణలో ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి రావడంలో భాగస్వాములైన జి పి ఓ లు, ఇప్పుడు ఏ చిన్న తప్పు చేసినా ప్రభుత్వానికి చెడ్డ పేరొస్తుందనీ సూచించారని తెలిపారు.
భూభారతిని అమలు చేయడమే కాకుండా సాదా బైనామా సక్రమంగా అమలు చేస్తారని హామీ ఇచ్చి నట్లు తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా నియమితులైన గ్రామ రెవెన్యూ అధికారులు కష్టపడుతూ రాష్ట్ర అభివృద్ధికి అంకితం అవుతామని రైతులకు సేవలు అందించేందుకు నిరంతరం పథకాలను ప్రజలకు చేరవేసేలా కృషి చేస్తామని వెల్లడించారు.