09-09-2025 10:30:02 AM
గుమ్మడిదల,(విజయక్రాంతి): దుక్కి దున్ని పొలాన్ని సాగు చేసి దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు రోజు రోజుకి కష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వం ఇస్తున్నటువంటి 2 యూరియా(urea) బస్తాలు రైతులకు అందడం లేదంటూ తీసుకున్నవారు 5 నుండి 10 బస్తాలు తీసుకొని మళ్లీ వారే యూరియా బస్తాలు వచ్చినప్పుడు తీసుకుంటున్నారని ఉదయం నుండి లైన్ లో నిలబడి ఉన్న వచ్చిన బస్తాలు మా వరకు అందడం లేదంటూ రైతులు కష్టాలను వెల్లడించారు.సోమవారం మండల రైతు కేంద్రాలలో పోలీసుల ప్రహరీలో ఎన్ని ఎకరాలు ఉన్న రెండు బస్తాలు ఇవ్వడంతో అవి కూడా ముందు వచ్చిన వారికి అందడంతో చుట్టుపక్కల ఉన్న వ్యవసాయదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేం ఏం పాపం చేశామని మాకు ఈ కష్టాలు తప్పడం లేదని కేవలం రెండు బస్తాలు ఇవ్వడంతో ఎన్ని ఎకరాలకు వాడుతాము అని ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు చావడం తప్ప మరి ఇంకేం చేస్తామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.