18 July, 2026 | 12:02 AM

భూదాన్ భూసమస్యను పరిష్కరించాలని బండి రమేష్‌కు వినతి

18-07-2026 12:02 AM

కూకట్‌పల్లి, జూలై 17 (విజయక్రాంతి): భూదాన్ భూ సమస్యను పరిష్కరించి 800 మంది లబ్ధిదారులకు న్యాయం చేయాలని టిపిసిసి ఉపాధ్యక్షులు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ను కలిసి భూదాన్ భూ బాధితులు విన్నవించారు. శుక్రవారం మూసాపేట్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బండి రమేష్ ను కలిసి వినతి పత్రం అందజేశారు.

బాధితులు ఈ సందర్భంగా బాధితులు ఐడిపిఎల్ ఉద్యోగుల అండతో సుమారు 17 ఎకరాల భూదాన్ భూమిని కొందరు కబ్జా చేసి హక్కుదారులైన తమను బెదిరిస్తున్నారని బండి రమేష్ దృష్టికి తీసుకువచ్చారు. హైకోర్టు క్లియరెన్స్ డిక్లరేషన్ ఉన్నప్పటికీ అధికారులు సైతం రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు లొంగి సమస్యపై దృష్టి పెట్టడం లేదని తెలిపారు. సమస్య పరిష్కారానికి కృషి చేయాలని బండి రమేష్ కు విన్నవించారు.

ఈ సమస్యపై స్పందించిన బండి రమేష్ వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయంలో సంబంధిత అధికారులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు అక్రమాలకు పాల్పడిన పై అధికారులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. బాధితులకు న్యాయం జరిగేదాకా వారి పక్షాన నిలబడతానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్  పార్టీ సీనియర్ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, నాయకులు కలీంఖాన్,పాల్గునరావు వాసు, నారాయణ, ఆంజనేయులు, రఘువీర్, మల్లికార్జున్, వాణి, కనకమ్మ, వజ్రం భూధన్ భూ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.