8 June, 2026 | 1:44 AM

ముంపు సమస్యకు పరిష్కారం చూపాలని ఎమ్మెల్యేకు వినతి

08-06-2026 12:00 AM

మేడ్చల్, జూన్ 7 (విజయక్రాంతి): మల్కాజిగిరి నియోజకవర్గంలోని బండచెరువు ప్రాంతంలో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చేయాలని  ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి లోతట్టు ప్రాంతాలకు చెందిన ప్రజలు విన్నవించారు.

ఈ సందర్భంగా అనంత సరస్వతి నగర్, ఎన్‌ఎండీసీ కాలనీ, షిరిడి నగర్ కాలనీ, సిఫిల్ కాలనీ, వసంతపురి కాలనీ తదితర ప్రాంతాలకు చెందిన ప్రజలు రాబోయే వర్షాకాలంలో తాము ఎదుర్కొనే ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

గతంలో భారీ వర్షాల సమయంలో వరద నీరు ఇళ్లలోకి చేరడం, రాకపోకలకు అంతరాయం కలగడం, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం వంటి సమస్యలను వివరించి, వీటికి శాశ్వత పరిష్కారం కల్పించాలని కోరారు. కాలనీవాసులు వివరించిన సమస్యలను ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి  సంబంధిత అధికారులతో సమన్వయం చేసి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మురుగేష్, ప్రభాకర్ గౌడ్, విక్రమ్, వెంకటేష్, ఉమాపతి, బాబురావు, లక్ష్మి ఆనంద్, మల్లేష్, అవినాష్తో పాటు ఆయా కాలనీల సంక్షేమ సంఘాల నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.