23 July, 2026 | 1:53 AM

ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎమ్మెల్యేకు వినతి

23-07-2026 12:00 AM

ములకలపల్లి,జూలై 22 (విజయక్రాంతి): రాచన్నగూడెం పంచాయతీ గ్రామాల్లోని గ్రామాలకు చెందిన అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరుతూ సర్పంచ్ మడకం విజయ అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణకు వినతిపత్రం అందజేశారు. ఆమె గండుగులపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే ను బుధవారం కలిసి గ్రామపంచాయతీలోని సమస్యలను వివరించారు.

పంచాయతీ పరిధిలోని అర్హులైన సుమారు 70 మంది పేదలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని గతంలో నిర్వహించిన భూమి సర్వేలో తలెత్తిన భూ సమస్యలను తక్షణం సర్వే నిర్వహించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.

పంచాయతీ పరిధిలో హెల్త్ సబ్ సెంటర్ మంజురు చేసి సబ్బందిని కేటాయించాలని కోరారు, కొత్త జిన్నెలగూడెం రాచన్నగూడెం మద్యగల బ్రిడ్జి కుంగిపోయినందున కొత్త బ్రిడ్జి మంజూరు చేయలని,ఆదివాసీ పేదలు సాగు చేసుకుంటున్న పోడు భూములకు విద్యుత్, సాగునీరు అందించాలని,పోడు సాగుదారులపై ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాలు ఆపాలని కోరారు.