23 July, 2026 | 1:51 AM

దళితుల సబ్‌ప్లాన్ నిధులను దారిమళ్లిస్తున్న రేవంత్ సర్కార్

23-07-2026 12:00 AM
  1. కాంగ్రెస్ ప్రభుత్వంపై దళిత సమాజం తిరుగుబాటు చేయాలి
  2. దళిత జాతికి అన్యాయం చేస్తున్న మనువాద పాలకులు
  3. సబ్‌ప్లాన్ నిధుల ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ 
  4. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి ప్రణాళిక చట్టాన్ని రద్దు చేయడానికి సర్కార్ కుట్ర
  5. దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు వడ్లమూరి కృష్ణ స్వరూప్

ముషీరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): తెలంగాణలో దళితుల సబ్ ప్లాన్ నిధులు దారి మళ్ళిస్తున్న రేవంత్ రెడ్డి కాం గ్రెస్ సర్కార్‌పై దళిత సమాజం తిరుగుబా టు చేయాలని దళిత బహుజన పార్టీ (డీబీబీ) జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్ పిలుపునిచ్చారు. ఈ సబ్‌ప్లాన్ కింద రాష్ట్రంలో ఇప్పటివరకు కేటాయించిన నిధులు, వివిధ శాఖలలో చేసిన ఖర్చులతో కూడిన సమగ్రమైన శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ మేరకు బుధవారం హిమాయత్ నగర్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ సమాజం సామాజిక, ఆర్ధి క,  జీవన అభివృద్ధి కోసం ఉద్దేశించి ఏర్పా టు చేసిన ప్రత్యేక ఆర్ధిక వార్షిక బడ్జెట్ నిధు లు12 వేల కోట్ల నిధులు 2014 నుండి రాష్ట్ర సర్కార్ లు దారి మల్లించి దళితుల అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ ఉప ప్రణాళిక నిధులు దారి మల్లించి ఇతర  శాఖల పనులకు ఖర్చులు చేస్తూ దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు.

దళిత కులాలకు తీవ్రంగా మనువాద దోపిడీ పాలకులు దళిత జాతికి తీవ్రంగా అన్యాయం చేశారని ఆయన విమర్శించారు.  దళితుల అభివృద్ధి కోసం ఖర్చులు చేయాల్సిన, వారికీ దక్కాలిసిన రాజ్యాంగ బద్ద చట్టం ఉద్దేశించిన నిధులు దారి మళ్ళిస్తున్న దళిత మంత్రులు, ఎమ్మెల్యే, మ్మెల్సీలు స్పందించకుండా  సీఎంకి పాలేరు తనం చేయడం అత్యంత దారుణమనమన్నారు. దళిత కులాలకు ఈ దళిత ప్రతినిధులు తీవ్ర ద్రోహం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

చివరికి ఈ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి ప్రణా ళిక చట్టం 2014 ను రద్దు చేయడానికి కాం గ్రెస్ సర్కార్ కుట్రలు చేస్తున్నదని, ఈ విషయంలో  బీఆర్‌ఎస్, బీజేపీ, ఏఐఎంఐఎం, కమ్యూనిస్ట్ పార్టీల ప్రతినిధులు స్పందించకుండా దళిత కులాలు పట్ల వివక్షత చూపు తున్నారన్నారు. ఇలాంటి పరిస్థితిల్లో దళితుల నిధుల సాధన, రక్షణ కోసం పెద్ద ఎత్తు న పోరాటం చేయకపోతే భవిష్యత్తు  లేదన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి. మోహన్ రావు, పార్టీ తెలంగాణ రాష్ట్ర కో  ఆర్డినేటర్ బి. ధర్మరాజు గౌడ్ పాల్గొన్నారు.