రాహుల్ గాంధీ అరెస్టుపై కాంగ్రెస్ ఆగ్రహం
- మోదీ దిష్టిబొమ్మ దగ్ధం
- నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన
ఉప్పల్, జూలై 22 (విజయక్రాంతి): రాహుల్ గాంధీతో పాటు ఇతర ప్రతిపక్ష నాయకుల అరెస్టులను ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఎలిఫెంట్ సర్కిల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఏఐసీసీ పిలుపు మేరకు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమా ర్ గౌడ్, ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మందమూల పరమేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ పరిరక్షణ ప్రమాదంలో పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షాల పాత్రను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అరెస్టులు, నిర్బంధాలను ఆయుధాలుగా ఉపయోగిస్తోందని విమర్శించారు.
ప్రజల తరఫున ప్రశ్నించే నాయకుల గొంతును అణచివేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. నీట్ పేపర్ లీక్ ఘటన దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపిందని నాయకులు పేర్కొన్నారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ఆరోపిస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామని తెలిపారు.
కార్యక్రమంలో శక్తి సాయి నగర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్.వి. కృష్ణ, మల్లాపూర్ డివిజన్ అధ్యక్షురాలు జమీల బేగం, హెచ్బీ కాలనీ నాయకుడు అంజయ్య, నాచారం డివిజన్ నాయకుడు రాజ్కుమార్, హెచ్‌ఎంటీ నగర్ అధ్యక్షుడు మహేష్ యాద వ్, మల్లాపూర్ కోఆర్డినేటర్ ధన్పాల్ రెడ్డి, హెచ్.ఆర్. మోహన్, కృష్ణారెడ్డి, బెల్లం గట్ట య్య, యశోదమ్మ రెడ్డి, డి.రాజు, కె.బాలరాజు, నెమలి అనిల్‌కుమార్, పర్వతాలు, శ్రీనివాస్ రెడ్డి, కప్పర సాయి, విజయరెడ్డి, ధనుంజయ్, బాలరాజ్ గౌడ్, ఫిరోజ్, మణి, అన్వర్, సుజాత, లలిత, ఉదయ్, జానీ, నిర్మలారెడ్డి, టిల్లు ముదిరాజ్, నిక్కీ గౌడ్, జయంతి గౌడ్, వినీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మహిలు, ఎన్‌ఎస్యూఐ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన కార్యక్రమానికి మద్దతు తెలిపారు.






