భువనగిరిలో 17 దేశాల ప్రతినిధులు
సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌పై అధ్యయనం
యాదాద్రి భువనగిరి, ఆగస్టు 24 (విజయక్రాంతి): పట్టణ ప్రాంతాల్లో చెత్త సేకరణ, దాని ప్రాసెస్ (సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్) తీరును అధ్యయనం చేయడానికి 17 దేశాలకు చెందిన 33 మంది ప్రతినిధులు శనివారం భువనగిరి మున్సిపాలిటీని సందర్శించారు. తుక్కాపురంలోని వేస్ట్ మేనేజ్ మెంట్ ప్లాంట్‌ను సంద ర్శించారు. పట్టణంలో సేకరించిన తడి, పొడి చెత్తను కంపోస్టు ఎరువుగా తయారీ చేసే విధానాన్ని పరిశీలించారు. అనంతరం భువనగిరి మునిసిపల్ కార్యాలయంలో అధికారులు పవర్ ప్రజంటేషన్ ద్వారా వారికి అవగాహన కల్పించారు.
ఈపీటీఆర్‌ఐ ఐటీఈసీ ఆధ్వర్యంలో సెప్టెంబర్2వ తేదీ వరకు నిర్వహించే ఇంటిగ్రేటేడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కోర్సు లో భాగంగా ఈ అద్యయనం జరుగుతోంది. భూటాన్, కెమరూన్, ఇథోపియా, జాంభి యా, కెన్యా, మడగాస్కర్, మలావి, మీర్యూ ట్స్, నైజిరియా, నేపాల్, పాలస్తీనా, పనామా, దక్షిణ సూడన్, శ్రీలంక, తునిసియా, ఉజ్బకిస్తాన్, వియత్నాం దేశాలకు చెందిన 33 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. వేస్ట్ సాలిడ్ మేనేజ్‌మెంట్ ప్రక్రియను కలెక్టర్ హనుమంతు కే జండగేతో కలిసి అధికారులు వివరించారు. ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, మునిసిపల్ చైర్మన్ వెంకటేశ్వర్లు స్వాగతం పలికారు.






