మెట్రోస్టేషన్లలో పెయిడ్ పార్కింగ్ తాత్కాలిక వాయిదా
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 24 (విజయక్రాంతి): ఎల్‌అండ్‌టీహెచ్‌ఎంఆర్‌ఎల్ ప్రయాణికుల కోసం కీలక ప్రకటన చేసింది. నాగోల్, మియాపూర్ మెట్రోస్టేషన్లలో ఆగస్టు 25, సెప్టెంబరు 1 నుంచి దశల వారీగా పెయి డ్ పార్కింగ్ అమలు చేయాలనుకునే నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తు న్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఉచిత పార్కింగ్ కొనసాగే అవకాశం ఉంది.
నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద గతంలో ఏర్పాటు చేసిన మెట్రో పార్కింగ్ చార్జీల పట్టికకు తెలుపు రంగు వేశారు. ఉచిత పార్కింగ్ సదుపాయం ఉన్న ఈ రెండు మెట్రోస్టేషన్లలో పెయిడ్ పార్కింగ్ అమలు కోసం ఈ నెల 14న ట్రయల్స్ నిర్వహించగా ప్రయాణికులు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన విషయం తెలిసిందే. దీంతో ఎల్‌అండ్‌టీహెచ్‌ఎంఆర్‌ఎల్‌పై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశమున్నందున ఎల్‌అండ్‌టీహెచ్‌ఎంఆర్ ఎల్ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు చర్చించుకుంటున్నారు.
నేడు నాగోల్‌లోధర్నా..
నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్ల వద్ద ఫ్రీ పార్కింగ్‌ను కొనసాగించాలని ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ ఆధ్వర్యంలో ఆదివారం నాగోల్ మెట్రో వద్దధర్నా చేయనున్నటట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్‌ప్రదీప్ తెలిపారు. శనివారం ధర్నాకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో హైదరాబాద్ అధ్యక్ష, కార్యదర్శులు రవికుమార్, కృష్ణ, శ్రీనివాస్, భీమేష్ పాల్గొన్నారు.






