టీఎన్జీవో సెంట్రల్ ఫోరం ఏర్పాటుకు వినతి
27-05-2024 12:05 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 26 (విజయక్రాంతి) : టీఎన్జీవో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ సెంట్రల్ ఫోరం ఏర్పాటు చేయాలని వివిధ జిల్లాల ప్రతినిధులు ఆదివారం టీఎన్జీవో సెంట్రల్ అధ్యక్షుడు జగదీష్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఫోరం పూర్వ కార్యదర్శి దాగమూరి, సచ్చిదానందం చారి తదితరులు పాల్గొన్నారు. దీనిపై కేంద్ర అధ్యక్షుడు కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఒక వారం రోజుల వ్యవధిలో ఎన్నికల తేదీ ఖరారు చేస్తామని చెప్పడంతో, వివిధ జిల్లాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.






