10 June, 2026 | 2:04 AM

కళ్యాణ మండపానికి స్థలం కేటాయించాలని దేవాదాయ శాఖ మంత్రికి వినతి

10-06-2026 12:51 AM

మేడ్చల్, జూన్ 9 (విజయక్రాంతి): మల్కాజిగిరి నియోజకవర్గం లోని గౌతమ్నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ జయగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం సమీపంలో ఇస్కాన్ టెంపుల్  శ్రీ గౌరంగ దాం సేవా ఫౌండేషన్ (హరే రామ హరే కృష్ణ సంస్థ) ఆధ్వర్యంలో కళ్యాణ మండపం నిర్మాణం కోసం సుమారు 1500 గజాల స్థలాన్ని కేటాయించేందుకు సహకరించాలని దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి విన్నవించారు.

అదేవిధంగా మల్కాజ్గిరి డివిజన్ శివపురి కాలనీలో ఉన్న శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయాన్ని దేవాదాయ శాఖ పరిధి నుండి మినహాయించి చారిటబుల్ ట్రస్ట్ కింద పరిగణించాలని కోరారు.  ఓల్ మల్కాజ్గిరిలోని శ్రీ విష్ణు దేవాలయానికి చెందిన స్థలంలో మున్నూరు కాపు భవనం నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని  వినతి పత్రంలో పేర్కొన్నారు.ఈ అంశాలపై మంత్రి కొండా సురేఖ  సానుకూలంగా స్పందించి, సంబంధిత అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకునేలా అధికారులకు సూచనలు చేస్తామని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే  రాజశేఖర్ రెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు మేకల రాము యాదవ్, వెంకన్న, నవీన్ , ఇస్కాన్ టెంపుల్  శ్రీ గౌరంగ దాం సేవా ఫౌండేషన్ అధ్యక్షులు వెంకటరెడ్డి, వసుధ , రాధ రెడ్డి, సతీష్రెడ్డి, రామిరెడ్డి, రేఖా రెడ్డి, శ్రీకాంత్ గోపీనాథ్ రాజేశ్వర్ నవీన్ రవీందర్ రామచంద్ర రెడ్డి రాజ్యలక్ష్మి, సాయిదాచా, మూర్తి రామశర్మ, మల్లికార్జున్, సుబ్రహ్మణ్యం, మోహన్రెడ్డి, రామకృష్ణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.