7 March, 2026 | 6:21 PM

గ్రామాభివృద్ధి నిధుల మంజూరుకోసం ఎమ్మెల్యేకు వినతి

07-03-2026 12:00 AM

చారకొండ మార్చి 6: మండలంలోని చంద్రాయన్ పల్లి గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ సర్పంచ్ చి లికేశ్వరం శంకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నా యకులు శుక్రవారం హైదరాబాద్ లోని స్వ గృహంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. ఈ సం దర్భంగా గ్రామంలో మినీ అంగన్వాడి భవ నం, ఇందిరమ్మ ఇండ్లు, అండర్ డ్రైనేజ్, అదనంగా సిసి రోడ్లు నిర్మాణానికి,

చంద్రాయన్ పల్లి నుంచి శేరిఅప్పారెడ్డిపల్లి వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలన్నారు. రైతులకు సబ్సిడీ స్ప్రింకర్ పైపులు, గ్రామంలో నెలకొన్న కరెంటు సమస్యలు తీర్చాలని కోరారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ సాంబయ్య గౌడ్, నాయకులు పర్వతాలు, బాధగోని వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.