రోడ్డు సమస్కను పరిష్కరించాలని అధికారులకు వినతి
మునిపల్లి,(విజయక్రాంతి): మండలంలోని మొగ్దుంపల్లి గ్రామ చౌరస్తా వద్ద రోడ్డు సమస్య తీవ్రంగా మారింది. పలుమార్లు కంకోల్ టోల్ ప్లాజా యాజమాన్యం, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులను సంప్రదించినా పరిష్కరించలేదు. దీంతో ఎలాగైనా రోడ్డు సమస్యను పరిష్కారం మార్గం చూపాలని కోరుతూ సోమవారం గుల్బర్గలోని ఎన్‌హెచ్ఏఐ హెడ్ ఆఫీస్‌లో ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్ట్ డైరెక్టర్ నవీన్‌ను మొగ్దుంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు రసూల్ పటేల్ తోపాటు గ్రామస్తులు చేసిన సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. రోడ్డు విషయమై ఈ ప్రాంతంలో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించి ప్రాజెక్టు డైరెక్టర్ నవీన్ రోడ్డుకు సంబంధించి సర్వే చేసి సమస్యను పరిష్కారమయ్యేలా చూస్తానని తెలిపినట్లు గ్రామస్తులు తెలిపారు.






