02-05-2025 09:54:22 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామంలో నీటిపారుదల కాలువ స్థాయిని పెంచాలని శుక్రవారం గ్రామస్తులు షబ్బీర్ అలీని కలిసి విన్నవించారు. కాచాపూర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్నా పలు సమస్యలపై ఆయనతో చర్చించారు. కాచాపూర్ గ్రామ పెద్ద చెరువు నుండి నీటి పారుదల కాలువ పునరుద్దరణ ను మందాపూర్ వరకూ సుమారు 2.5 కిలోమీటర్లు అభివృద్ధి చేయాలి అనీ కోరారు. వెంటనే షబ్బీర్ అలీ స్పందించి త్వరలో పనులు ప్రారంభం చేసి అట్టి పనిని పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు, రాజీవ్ యువ వికాస్ పథకం, డబుల్ బెడ్ రూముల పంపిణీ అన్నీ పథకాలు నిజమైన అర్హులకు ఇస్తామని కూడా మాటిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు నర్సింగరావు, మాజీ ఎంపీపీ బైండ్ల సుదర్శన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రణాళిక కమిటీ అధ్యక్షులు బైండ్ల దశరథం, సీనియర్ నాయకులు రవి, శ్రీను, లింగం, తోగారి అమృత రావ్, తోగారి శ్రీధర్, పార్టీ కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు.