calender_icon.png 3 May, 2025 | 3:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కులగణన క్రెడిట్ రాహుల్‌దే!

03-05-2025 03:06:14 AM

  1. కేంద్రం నిర్ణయం తీసుకోవడం కాంగ్రెస్ విజయం 
  2. 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడం అభినందనీయం
  3. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ వెల్లడి
  4. కులగణన శాస్త్రీయ పద్ధతిలోనే నిర్వహించాం: మంత్రి పొన్నం 
  5. గవర్నర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ బీసీనేతలు  

హైదరాబాద్, మే 2 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం బీసీలకు రాజకీయ, విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ ఉభయసభల్లో చేసిన బిల్లుకు ఆమోదం తెలిపి రాష్ట్రపతికి పంపిన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ నేతృత్వంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హను మంతరావు, మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్సీలు విజయశాంతి, దండె విఠల్, బస్వరాజు సారయ్య, ప్రభుత్వ విప్‌లు బీర్ల ఐలయ్య, ఆది శ్రీనివాస్ తదితరులు శుక్రవారం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశా రు.

అనంతరం రాజ్‌భవన్ వద్ద పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ.. స్వతంత్ర భారతావనిలో కులగణన నిర్వహించిన మొదటి రాష్ర్టం తెలంగాణ అని అన్నా రు. సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలో కామారెడ్డి డిక్లరేషన్‌కు అనుగుణంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించామన్నారు. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు రాజకీయ, విద్యాఉద్యోగాల్లో 42శాతం రిజర్వేషన్లు పెంచుతూ ఉభయసభల్లో చేసిన బిల్లును ఏప్రిల్ 8న గవర్నర్ ఆమోదించి రాష్ర్టపతికి పంపడంతో తెలంగాణ బీసీ మంత్రులు, నేతలతో కలిసి గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మకు ధన్యవాదాలు చెప్పామన్నారు.

కేంద్రం జనగణనతో పాటు కులగణన నిర్ణయం తీసుకోవడమంటే రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ పార్టీ విజయమన్నారు. కులగణన క్రెడిట్ రాహుల్‌గాంధీదేనని మహేశ్‌కుమార్‌గౌడ్ స్పష్టం చేశారు. తెలంగాణ మోడల్‌ను కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తోందని, కులగణనపై కేంద్రం నిర్ణయంతో రాహుల్ ఆశ యం నెరవేరిందని తెలిపారు.

మంత్రి పొ న్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం దేశా నికి రోల్‌మోడల్‌గా బీసీలకు రాజకీయ, వి ద్యా, ఉద్యోగాల్లో 42శాతం రిజర్వేషన్లు కల్పి స్తూ చట్టం చేసిందన్నారు. గతంలో వ్యతిరేకించినవారు ఇప్పుడు తెలంగాణ ఆలోచన ను కేంద్రం మార్గదర్శకత్వంగా తీసుకుంటే జీర్ణించుకోలేక విమర్శిస్తున్నారని మండిపడ్డారు. కులగణనను తమ ప్రభుత్వం శా స్త్రీయ పద్ధతిలో నిర్వహించిందన్నారు. 

బీసీబిల్లును పార్లమెంట్‌లో ఆమోదించాలి: వీహెచ్ 

బీసీ ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన బీసీబిల్లును ఆమోదించి బీసీలకు న్యాయం చేయాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు విజ్ఞ ప్తి చేశారు. జనగణనలో కులగణన చేస్తామని కేంద్రం తీసుకున్న నిర్ణయం హర్షణీ యమని, పేద మైనార్టీలను కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం మోడల్‌ను కేంద్రం పరిగణలోకి తీసుకోవాలని వీహెచ్ కోరారు.