calender_icon.png 3 May, 2025 | 11:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాయపడిన నాయకురాలికి పైడి ఎల్లారెడ్డి ఆర్థిక సాయం

02-05-2025 10:10:38 PM

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రం లో జిల్లా బీజేపీ మహిళా కార్యదర్శి  మ్యాథరి సుజాత శ్రీనివాస్ కొన్ని రోజుల క్రిందట ద్విచక్ర వాహనం పై వెళ్తుండగా  ఎదురు వస్తున్న వాహనాన్ని తప్పించబోయి పడిపోవడంతో గాయపడ్డారు. గాయపడిన మహిళా జిల్లా కార్యదర్శి సుజాతను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ఎక్స్రే రే తీయించడంతో ఎడమ చేయి విరగడం జరిగిందని ఆసుపత్రి వైద్యులతో చికిత్స పొందుతున్నట్లు తెలుసుకొని రాష్ట్ర బిజెపి నాయకుడు పైడీ ఎల్లారెడ్డి, బిజెపి నాయకులతో కలిసి గురువారం రాత్రి  బిజెపి జిల్లా మహిళా కార్యదర్శి మ్యాథరి సుజాత శ్రీనివాస్ ను పరామర్శించారు. అనంతరం వారికి రూ.5000 ఆర్థిక సాయం అందించారు. అలాగే అన్నాసాగర్ గ్రామంలో గత కొద్ది రోజుల కిందట సీనియర్ బీజేపీ కార్యకర్త స్వర్గస్తుల యినందున వారి యొక్క కుటుంబాన్ని పైడి ఎల్లారెడ్డి పరామర్శించి వారికి ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ బత్తిని దేవేందర్, బీజేపీ మండల అధ్యక్షులు పెద్దడ్ల నర్సింలు, పికె నరేష్, నక్క గంగాధర్, లింగంపేట్ మండల అధ్యక్షులు క్రాంతి కుమార్, నాగిరెడ్డిపేట్ మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్, మాజీ సర్పంచ్ దేవేందర్, తదితరులు పాల్గొన్నారు.