11 May, 2026 | 2:18 AM

పరిశోధనలు సామాజిక ప్రయోజనంతో సాగాలి

11-05-2026 12:36 AM

డాక్టర్ సీహెచ్.వీ. పురుషోత్తం రెడ్డి

మొయినాబాద్ మే 10(విజయ క్రాంతి): పరిశోధన కార్యక్రమాలు సామాజిక ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని సాగాలని చైతన్య డీమ్డ్ టూబీ యూనివర్సిటీ ఫౌండర్ అండ్ ఛాన్సలర్ డాక్టర్ సీహెచ్.వీ. పురుషోత్తం రెడ్డి పేర్కొన్నారు. మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని హిమాయత్నగర్లో ఉన్న చైతన్య డీమ్డ్ టూబీ యూనివర్సిటీలో కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వీ. స్వప్నకు పీహెచ్డీ డిగ్రీ పట్టా ప్రదానం చేశారు.

లిక్విడిటీ అండ్ ప్రాఫిటబిలిటీ అనాలిసిస్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్  ఏ కంపరేటివ్ స్టడీ ఆఫ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టార్ ఇన్ ఇండియా అనే అంశంపై ఆచార్య జీ. ఉషాశ్రీ పర్యవేక్షణలో స్వప్న తన పరిశోధనను పూర్తి చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సీహెచ్.వీ. పురుషోత్తం రెడ్డి చేతుల మీదుగా పీహెచ్డీ పట్టా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామర్స్, బిజినెస్ మేనేజ్మెంట్ రంగాల్లో జరిగే పరిశోధనలు రాష్ట్ర, దేశ అభివృద్ధికి ఎంతో కీలకమన్నారు.

ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల ద్రవ్యత్వం, లాభదాయకతపై తులనాత్మక అధ్యయనం చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇలాంటి పరిశోధనలు భవిష్యత్తు అభివృద్ధికి బలమైన పునాది వేస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ కరస్పాండెంట్ సీహెచ్. సువర్ణ దేవి, డైరెక్టర్ అండ్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ సీహెచ్. సాత్వికా రెడ్డి, వైస్ ఛాన్సలర్ జీ. శంకర్ లింగం, రిజిస్ట్రార్ యం. రవీందర్, క్రిస్టోఫర్, ఏ. రాజు, డాక్టర్ పీ. సుగంధ దేవి, బి. రాజేందర్ రెడ్డి, ఈ. జగదీష్ కుమార్, డాక్టర్ టీ.వి.జీ. శాస్త్రి, జీ. ఉషాశ్రీ, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ గాదె రాంబాబు రెడ్డి, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.