28 June, 2026 | 12:13 PM

Breaking News

రోజువారి కూలీల జేబుకు చిల్లు పెడుతున్న మద్యం మాఫియా   •   రేవంత్ రెడ్డి నల్లగొండ సభ వేళ బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్   •   ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి   •   రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం   •   పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి   •   పి.వి. నరసింహారావుకి నివాళులర్పించిన కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ   •   ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలి   •   ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా కొత్తగూడెం   •   కారు, లారీ ఢీకొని యువకుడు మృతి   •   విద్యుదుఘతంతో వాటర్ పిల్టర్ టెక్నిషియాన్ మృతి   •  

ఔషధ రంగంలో పరిశోధనలు చేయాలి

21-06-2025 02:14 AM

ఏపీ ఎంఎస్‌ఎంఈ శాఖ ప్రిన్సిపల్ టెక్నికల్ అడ్వైజర్ శ్రీనివాస శంకర ప్రసాద్ 

గుంటూరు, జూన్ 20 (విజయక్రాంతి): ఫార్మసీ అధ్యాపకులు ఔషధ రంగంలో పరిశోధనలు చేసి నూతన ఔషధాలను కనుగొ నాలని ఏపీ ఎంఎస్‌ఎంఈ శాఖ ప్రిన్సిపల్ టెక్నికల్ అడ్వైజర్ డాక్టర్ ఎం శ్రీనివాస శంకర ప్రసాద్ తెలిపారు. శుక్రవారం అమరావతి రోడ్డులోని హిందూ ఫార్మసీ కళాశాల లో పరిశోధనలు, అభివృద్ధిపై ఏర్పాటు చేసిన సెమినార్‌లో ఆయన మాట్లాడారు. ఫార్మసీ విద్యార్థులను కూడా పరిశోధన చేసే విధంగా శిక్షణ కల్పించాలని సూచించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమలకు పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేస్తున్నాయన్నారు. కళాశాల చైర్మన్ జూపూడి రంగరాజు మాట్లాడుతూ.. పాముకాటుకు, కాళ్ళు తీతలకు మూలిక ఔషధాలలోని రసాయనిక పదార్థాల వివరాలను తెలుసుకొని పేటెంట్ పొం దవచ్చు అన్నారు. చైర్మన్ డాక్టర్ మన్నవ రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ..

మధుమేహం దాని దుష్ప్రభావాలు గురించి తెలి యజేశారు. ఈ వ్యాధి చికిత్సకు అందుబాటులో ఉన్న ఔషధాల వివరాలను తెలియ జేశారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎంవి నాగభూషణం ఆధ్వర్యంలో ముఖ్య అతిథి డాక్టర్ ఎం శ్రీనివాస శంకర్ ప్రసాద్‌ను శాలువా, మెమెంటోలతో  సత్కరించారు.