21-06-2025 02:12:24 AM
చలపతి కళాశాల ప్రిన్సిపల్ నాదెండ్ల రామారావు
గుంటూరు, జూన్ 20 (విజయక్రాంతి): శరీరానికి, మెదడుకి మధ్య ఏకాంతాన్ని కుదిర్చే సునిసితిమైన శాస్త్రమే యోగా అని చలపతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కళాశాల ప్రిన్సిపల్ నాదెండ్ల రామారావు తెలిపారు. శనివారం యోగా డేను పురస్కరించుకొని శుక్రవారం ఫార్మసీ విద్యార్థులతో ముచ్చటించారు. ఆధునిక జీవితంలో ఒత్తిడి, ఆందోళనలతో సతమతమవుతున్న విద్యార్థులకు యోగా ఒక వరంలా మారుతోందన్నారు.
మంచి నిద్ర నుంచి మెరుగైన ఏకాగ్రత వరకు యోగా ఎలా సహాయపడుతుందో వివరించారు. 2016 నుంచే చలపతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కళాశాలలో ప్రతిరోజు యోగా, ధ్యానం విద్యార్థులకు నేర్పుతున్నామని వెల్లడించారు. యోగాలో చురుగ్గా పాల్గొన్న విద్యార్థులు 80శాతానికి పైగా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. నాట్కో, అరబిందో, డాక్టర్ రెడ్డీస్ వంటి ప్రముఖ సంస్థల్లోనే కాకుండా అమెరికా, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఉన్నత విద్యలో ప్రవేశించారని గుర్తు చేశారు.