07-07-2025 12:06:26 AM
కామారెడ్డి, జూలై 6 (విజయ క్రాంతి), పల్లెల్లో స్థానిక ఎన్నికల సందడి నెలకొంది. ప్రభుత్వం త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహిస్తామని ప్రకటించడంతో ఆశావహుల కు రిజర్వేషన్ బెంగ పట్టుకుంది. రిజర్వేషన్ కలిసి వస్తుందో లేదో అని ఆందోళన చెందుతున్నారు. కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద, సబ్ డివిజన్ల పరిధిలో 533 గ్రామపంచాయతీలు ఉన్నాయి.
పంచాయతీ లకు సర్పంచులు, వార్డు సభ్యుల ఎన్నిక తోపాటు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఎన్నికల నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని భావించిన నేతలు పట్టణాల్లో ఉన్నవారు సైతం పల్లెల వైపు వెళ్లి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబడాలని ఉ విళ్ళూరుతున్నారు.
గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి నెలకొంది. ఆశావహులు కులాల వారిగా ఓట్లను రాబట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అంతవరకు బాగానే ఉన్నా రిజర్వేషన్ అదృష్టం కలిసి వస్తుందా లేదా అని ఆందోళన చెందుతున్నారు.
రిజర్వేషన్ అనుకూలంగా వస్తేనే పోటీలో ఉండే అవకాశం ఉండడంతో తమకు పోటీ చేసే అవకాశం రావాలంటే రిజర్వేషన్ కలిసి రావాలని ఆశావాహులు భావిస్తున్నారు. ఏ పల్లెల్లో చూసిన స్థానిక సంస్థల ఎన్నికల సందడిపై చర్చ కొనసాగుతుంది.
అవకాశం చే జారునా..
గ్రామాల్లో సర్పంచ్ గా పోటీ చేసేందుకు రిజర్వేషన్ కలిసి వస్తుందని భావించిన ఆశావాహులు ఓట్లను రాబట్టేందుకు ఇప్పటినుంచే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇంత కష్టపడినా రిజర్వేషన్ కలిసి వస్తుందా లేదా అనే సందిగ్గం వ్యక్తం చేస్తున్నారు. రిజర్వేషన్ల ఖరారు వరకు టెన్షన్ మాత్రం తప్పదని భావిస్తున్నారు. ఎన్నో రోజులుగా ఆశపడుతున్న సర్పంచ్ గిరి పదవి కావాలంటే రిజర్వేషన్ ముందుగా కలిసి రావాలి.
తర్వాత గెల్పోటంలపై చర్చించుకోవచ్చని ముందుగా రిజర్వేషన్ కలిసి రావాలని ఆశావాహులు అంటున్నారు. కులాల వారీగా ఆశావాహులు తమకు ఓట్లు వస్తాయని ఆశల పల్లకిలో ఉన్నారు.
రిజర్వేషన్ కల్సి వస్తే గెలుపు సునాయాసమైనని భావిస్తున్న వారు కొందరైతే, మరికొందరు రిజర్వేషన్ వచ్చిన తర్వాతే పోటీ చేయాలా వద్దా అనేది నిర్ణయించుకుంటామని మరికొందరు ఎటు తేల్చుకోలేకపోతున్నారు. ప్రభుత్వం మాత్రం ఎన్నికల నిర్వహించేందుకు కసరత్తు పూర్తి చేసింది. రిజర్వేషన్ల ఖరారు మాత్రమే మిగిలి ఉంది.
రాజకీయంగా కొన్నాళ్లుగా నిశ్శబ్దంగా ఉన్న పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పల్లెల్లో ముందుగానే స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం కనిపిస్తుంది. పల్లెల్లో ఏ చౌరస్తాలో చూసిన ఏ ఫంక్షన్ లో చూసిన స్థానిక ఎన్నికలపై చర్చ కొనసాగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఈ నెలాఖరు వరకు విడుదల అయ్యే అవకాశాలు ఉండడంతో పల్లెల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
రిజర్వేషన్ల బెంగ
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేద్దాం అనుకునే వారికి రిజర్వేషన్ల బెంగ పట్టుకుంది. అనుకూలమైన రిజర్వేషన్ వస్తుందా లేదా అని ఆందోళన చెందుతున్నారు. రిజర్వేషన్ అవకాశం కలిసి వస్తుందా లేక చేజారుతున్న అనే ఆందోళనలో మరికొందరు ఆశావాలు ఉన్నారు. వివిధ వర్గాల ప్రజలను కుల సంఘాల నాయకులను ముందుగా తమకు మద్దతు ఇవ్వాలని అడుగుతున్నారు.
కొన్ని రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు రానుండడంతో ఆశావాహులు స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు ఎప్పుడు అని ఎదురుచూస్తున్నారు. ఎన్నికల ఖరారు కాగానే తమ అదృష్టాన్ని ఎన్నికల్లో నిలబడి పరీక్షించుకోవాలని ఆశావాహులు భావిస్తున్నారు.
అధికార పార్టీ తో పాటు అన్ని పార్టీల్లోనూ స్థానిక సంస్థలు టికెట్లు కేటాయింపు ఎలా ఉంటుందని ఉత్కంఠ నెలకొంది ప్రభుత్వం ఏ క్షణమైనా రిజర్వేషన్లు ఖరారు చేసే అవకాశం ఉండడంతో తమకు రిజర్వేషన్లు కలిసి వస్తాయా లేవా అని ఆందోళన చెందుతున్నారు. ఎన్నో ఏళ్ల కలను నెరవేర్చుకోవాలని ఆలోచన లో ఆశావాహులు ఉన్నారు.
రిజర్వేషన్ కలిసి వస్తుందో లేదో...
ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లను ప్రకటించే వరకు టెన్షన్ గానే ఉంది. సర్పంచ్‌గా పోటీ చేయాలని ఉంది. రిజర్వేషన్ కలిసి వస్తుందో రాదు అనే టెన్షన్ పట్టుకుంది. ప్రభుత్వం వెంటనే రిజర్వేషన్లు ప్రకటించాలి.
- నర్సింలు, బీబీపేట, కామారెడ్డి జిల్లా.
సర్పంచ్ గా పోటీ చేస్తే గెలుస్తా సర్పంచిగా పోటీ చేసేందుకు ఎదురుచూస్తున్నాను. రిజర్వేషన్ అనుకూలంగా వస్తే గ్రామస్తులు తనకే సర్పంచిగా గెలిపిస్తారు. గ్రామస్తులకు ఎన్నో సేవలు అందించాను. రిజర్వేషన్ కల్సివస్తే సర్పంచిగా గెలిపిస్తామని గ్రామస్తులు అంటు న్నారు. సర్పంచిగా పోటీ చేస్తే గెలుస్తాను అని నమ్మకము ఉంది.
వంకాయల రవి, సదాశివ నగర్,