calender_icon.png 7 July, 2025 | 12:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాజెక్టుల్లోకి భారీగా వరద

07-07-2025 12:05:34 AM

నిర్మల్, జూలై 6 (విజయక్రాంతి): ఉమ్మ డి ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలు నేపథ్యంలో జిల్లా లోని సాగునీటి ప్రాజెక్టులకు వరద ప్రభా వం ప్రారంభమైనట్లు అధికారులు తెలిపా రు. ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బూత్ నేరడిగొండ ఇచ్చోడ ఇంద్రవెల్లి పెంబి సిరికొండ  వర్షం కురవడంతో కడెం ప్రాజెక్టులోకి 6996 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నట్టు అధికారులు తెలిపారు.

ప్రాజె క్టు నీటిమట్టం 700 అడుగులు కాగా 687.05 అడుగులకు చేరుకున్నట్టు తెలిపారు. ఎస్ ఆర్ ఎస్ పి పూర్తి నీటిమట్టం 10 91 అడుగులు కాగా ప్రస్తుతం 10 66 అడుగులకు చేరుకుందని చేరుకున్నట్టు తెలిపారు. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి నది ద్వారా సుమారు ఎనిమిది వేల క్యూసెక్కుల నీరు ఎస్‌ఆర్‌ఎస్‌కి వస్తున్నట్లు తెలిపారు. అలాగే పగడ్డన్న శుద్ధ వాగు ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 358 అడుగులు కాక 354 అడుగులకు చేరుకున్నట్టు తెలిపారు.

స్వర్ణ రిజర్వాయర్ ప్రాజెక్టు నీటిమ ట్టం 11 83 అడుగులు కాగా 11 74 అడుగు లు ఉన్నట్టు తెలిపిన అధికారులు ఈ ప్రాజెక్టులకు ఇప్పుడిప్పుడే వార్ధా ప్రారంభమైం దని నీటిపారుదల శాఖ అధికారులు వివరించారు. నిర్మల్ జిల్లాలో ఆదివారం విస్తారం గా వర్షాలు కురిసాయి దీంతో రైతులు సం తోషం వ్యక్తం చేస్తున్నారు. రైతులు సాగు చేసుకుంటున్నా పంటలకు ఈ వర్షం ఎంతో మేలు చేస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.