calender_icon.png 7 July, 2025 | 5:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జగ్జీవన్‌రామ్ ఆశయసాధనకు పాటుపడాలి

07-07-2025 12:06:59 AM

భారతరత్న కోసం కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: ఎమ్మెల్యే పాయల్ శంకర్ 

ఆదిలాబాద్, జూలై 6 (విజయక్రాంతి): అట్టడుగు వర్గాల నుంచి ఎదిగి దేశ స్వాతం త్ర ఉద్యమంలో పాల్గొని, రాజ్యాంగ రచన లో తన వంతు పాత్ర పోషించిన కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ కు భారతరత్న అవార్డు అందేలా కేంద్ర ప్ర భుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు.

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ చౌరస్తాలో ఆదివారం ఏర్పాటు చేసిన జగ్జీవన్ రామ్ 39వ వర్ధంతి సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులతో కలిసి ఆ మహనీయుని విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళు లర్పించారు. అనంతరం ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. దేశంలోనే అందరికంటే ఎక్కువ కాలం సుదీర్ఘంగా పార్లమెంటు నేతగా సేవలందించిన ఘనత బాబు జగ్జీవన్ రామ్‌కే దక్కిందన్నారు.

దేశంలో ఆహార సంక్షోభం ఉన్నప్పుడు, ఆహార కొరతను   అధిగమించే విధంగా వ్యవసాయ శాఖ మం త్రిగా ఎంతో కృషి చేశారన్నారు. రైల్వే శాఖ, తపాల శాఖల కు ప్రాతినిధ్యం వహించి వన్నె తెచ్చారులరని, రక్షణ శాఖ మంత్రిగా యుద్ధరంగంలో భారతదేశాన్ని గెలిపించడం కోసం కృషి చేశారన్నారు.

50 సంవత్సరాల పాటు ఈ దేశానికి వివిధ హోదాల్లో సేవలు అం దించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారులు మనోహర్, సునీత, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఆరెల్లి మల్లేష్ మాదిగ, జగ్జీవన్ రామ్ కమిటీ అధ్యక్షులు మల్యాల స్వామి, బీజేపీ నాయకులు లాలా మున్నా, ఆకుల ప్రవీణ్, జోగు రవి తదితరులు  పాల్గొన్నారు.