calender_icon.png 17 January, 2026 | 6:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారదర్శకంగా మున్సిపల్ వార్డుల రిజర్వేషన్ ప్రక్రియ

17-01-2026 05:34:40 PM

జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని మున్సిపల్ వార్డుల రిజర్వేషన్ పారదర్శకంగా నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో మున్సిపల్ అధికారులతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఆసిఫాబాద్, కాగజ్ నగర్ మున్సిపల్ వార్డుల వారీగా రిజర్వేషన్ కేటాయింపు ప్రక్రియ నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఆసిఫాబాద్ మున్సిపల్ పరిధిలో 20 వార్డులు, కాగజ్ నగర్ మున్సిపల్ పరిధిలో 30 వార్డులకు డెడికేషన్ కమిషన్ కేటాయింపు ప్రకారం రిజర్వేషన్ ప్రక్రియ నిర్వహించడం జరిగిందని తెలిపారు. మహిళలకు కేటాయించిన వార్డులను లాటరీ పద్ధతిలో రిజర్వేషన్ కేటాయించడం జరిగింది.

షెడ్యూల్డ్ కులములు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, జనరల్ మహిళలకు 50 శాతం సీట్లను మహిళలకు కేటాయించడం జరిగిందని తెలిపారు. రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్, కాగజ్ నగర్ మున్సిపల్ కమిషనర్లు గజానన్, రాజేందర్, పట్టణ ప్రణాళిక అధికారి యశ్వంత్, ఎన్నికల విభాగం అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.