calender_icon.png 17 January, 2026 | 7:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల నిర్మాణ స్థల పరిశీలన

17-01-2026 05:38:43 PM

జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే

వాంకిడి,(విజయక్రాంతి): యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల నిర్మాణ స్థలాన్ని పరిశీలించడం జరిగిందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. శనివారం  వాంకిడి మండలం బెండార గ్రామంలో గల ప్రభుత్వ స్థలాన్ని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల నిర్మాణం కొరకు పరిశీలించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల నిర్మాణానికి చర్యలు చేపడుతుందని తెలిపారు.

గురుకులంలో విశాలమైన గదులు, పాఠశాల భవనాలు, క్రీడాస్థలం ఏర్పాటుకు సుమారు 25 ఎకరాల ప్రభుత్వ భూమి అవసరం ఉంటుందని, సర్వే అధికారులు, టీజీఈడబ్ల్యుఐడీసీ అధికారులు వెంటనే స్థలానికి హద్దులు నిర్ధారించి చదువును చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం త్వరలోనే పనులు ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల నిర్మాణం ద్వారా ఈ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య, సాంకేతికత, నైపుణ్యతతో కూడిన శిక్షణ లభిస్తుందని తెలిపారు. భవన నిర్మాణాలు చేపట్టి వచ్చే విద్యా సంవత్సరం అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.