11 June, 2026 | 1:03 AM

‘గిన్నిస్’ రికార్డు సాధించిన పెద్దఅంబర్‌పేట్, శాంతినగర్ వాసులు

11-06-2026 12:09 AM

హల్లెల్ మ్యూజిక్ స్కూల్ ఆధ్వర్యంలో ఘన సన్మానం

అబ్దుల్లాపూర్ మెట్, జూన్ 10 : ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మైలురా యిని అధిగమించి సంగీతంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్ రికార్డ్సో్ల పెద్దఅంబర్ పేట్ శాంతినగర్ కాలనీకి చెందిన ఇజ్రాయిల్, నాని, రోని రొనాల్ లు చోటు దక్కించుకున్నారు. వీరిని గత నెల 29న గచ్చిబౌలిలోని ’విక్టరీ ఆడిటోరియంలో నిర్వహించిన గిన్నిస్ ’అచీవర్స్ మీట్’ వేదిక పై ఘనంగా సన్మానించారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 2న హైదరాబాద్లో గిన్నిస్ వరల్ రికారడ్స్ ప్రతినిధుల సమక్షంలో ’హల్లెల్ మ్యూజిక్ స్కూల్’ ఒక బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 22 దేశాల నుండి తరలివచ్చిన 2వేల మంది కీబోర్డ్ వాయిద్యకారులు ఒకే వేదికపై ఒకే లయతో గంటపాటు ఏకధాటిగా (ఆగకుండా) కీబోర్డ్ వాయించి సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు. ఈ అద్భుతమైన ప్రదర్శనలో అత్యంత ప్రతిభను కనబరిచిన 777 మంది విద్యార్థులను గిన్నిస్ రికార్డు సాధకులుగా ఎంపిక చేశారు.

గచ్చిబౌలిలో జరిగిన అచీవర్స్ మీట్ కార్యక్రమంలో, హల్లెల్ మ్యూజిక్ స్కూల్ వ్యవస్థాపకులు అగస్టిన్ దండింగి ముఖ్య అతిథిగా విచ్చేసి, ఎంపికైన ప్రతిభా వంతులకు గిన్నిస్ వరల్ రికార్డు అధికారిక సర్టిఫికేట్లను  అందజేసి శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ అంతర్జాతీయ స్థాయి రికార్డులో పెద్దఅంబర్ పేట్ శాంతినగర్ కాలనీకి చెందిన ఇజ్రాయిల్, నాని, రోని రొనాల్డ్‌తమ అసాధారణ కీబోర్డ్ ప్రతిభను చాటి గిన్నిస్ రికార్డులో చోటు సంపాదించుకున్నారు.

చిన్న వయస్సులోనే అంతర్జాతీయ వేదికపై శాంతినగర్ కాలనీ పేరును ప్రఖ్యాతిని తీసుకొచ్చిన ఇజ్రాయిల్, నాని, రోని రొనాల్ లను వారి తల్లిదండ్రులు, కాలనీ పెద్దలు, పాఠశాల యాజమాన్యం, గ్రామ యువత ప్రత్యేకంగా అభినందించారు. రాబోయే రోజుల్లో వీరు సంగీత ప్రపంచంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.