ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించండి
నిర్మల్ (విజయక్రాంతి): ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్(Additional Collector Faizan Ahmed) అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... ప్రతి దరఖాస్తును పరిశీలించి తక్షణమే స్పందించాలని అధికారులకు సూచించారు.
అలాగే వానకాలం నేపథ్యంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో శానిటేషన్ చర్యల అమలులో ఎటువంటి నిర్లక్ష్యం జరగకూడదన్నారు. వనమహోత్సవంలో భాగంగా శాఖల వారీగా లక్ష్యం మేరకు మొక్కలు నాటాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లను పూర్తీ చేయాలనీ సూచించారు. జిల్లాలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్లను అర్హులని లబ్దిదారులకు అందేలా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజల సమస్యలను సంబంధిత శాఖలు సమన్వయంతో పరిష్కరించేలా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీవో రత్న కళ్యాణి, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.






