ఎల్పీజీ కొరత తీర్చండి
కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రికి రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లేఖ
హైదరాబాద్, మార్చి 31 (విజయక్రాంతి): తెలంగాణలో ఎల్‌పీజీ కొరత కారణంగా.. ఎల్‌పీజీ ఆటోరిక్షా డైవర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అత్యవసరంగా అదనపు ఎల్‌పీజీ సరఫరా చేయాలని మంత్రి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మంగళవారం కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హార్దీప్‌పూరికి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లేఖ రాశారు.
ఇరాన్, ఇజ్రయిల్, అమెరికా యుద్దం కారణంగా తలెత్తిన ఎల్‌పీజీ సరఫరా పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తోందన్నారు. రాష్ట్రంలో లక్షకుపైగా ఎల్‌పీజీ ఆటోలు నడుస్తున్నాయని, ఆటోలకు గ్యాస్ దొరకకపోవడంతో ఆటోడ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రైవేట్ అవుట్‌లెట్స్‌లో ఈ సమస్య తీవ్రం గా ఉందని..
ప్రజా రవాణాలో అంతరాయం ఏర్పడుతుందని, తద్వారా ప్రజల్లో ఆందోళన కొనసాగుతోందన్నారు. గృహ అవసరాల కోసం డొమెస్టిక్ ఎల్‌పీజీ సరఫరా 100 శాతం కొనసాగించాలని తెలిపా రు. కమర్షియల్ ఎల్‌పీజీ పంపిణీపై కేంద్ర మార్గదర్శకాలను చేయాలని, ధరల పెరుగుదలపై నియంత్రణ చర్యలు తీసుకోవా లన్నారు. కేంద్రం తక్షణమే జోక్యం చేసుకుంటేనే ప్రజా రవాణా సేవలు నిలకడగా కొనసాగుతాయని కేంద్ర మంత్రికి రాసిన లేఖలో ఉత్తమ్ పేర్కొన్నారు.




