2 June, 2026 | 2:40 AM

జేఈఈలో రెసోనెన్స్ విజయ కేతనం

02-06-2026 01:50 AM

వందలాది మంది విద్యార్థులకు ఐఐటీ సీట్లు 

హైదరాబాద్, జూన్ 1 (విజయక్రాంతి): జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలలో రెసోనెన్స్ జూనియర్ కాలేజీలు విజయ కేతనం ఎగుర వేశాయి. ఓపెన్, ఇతర కేటగిరీలలో పదిహే డు మంది విద్యార్థులు వెయ్యి లోపు ర్యాంకు లు సాధించారు. రెసోనెన్స్ వివి ధ క్యాంపస్ల నుంచి 185 మందికి పైగా విద్యార్థులు దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీలలో ప్రవేశాలు పొందనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెసోనెన్స్ విద్యా సంస్థల డైరెక్టర్ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ జేఈఈ ఫలితాల్లో మా విద్యార్థుల ప్రదర్శన అద్భుతమన్నారు.

ఇది వారి కష్టాన్ని, సబ్జెక్టుపై ఉన్న స్పష్టతను, రాణించాలన్న పట్టుదలను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. అభినవ్ చిట్టూరి 11వ ర్యాంకు, గంటా ప్రజ్ఞేష్ 94వ ర్యాంకు, సపవత్ పావన సమీక్ష 105వ ర్యాంకు, శెట్టిపల్లి అన్వితరెడ్డి 190వ ర్యాంకు, చీర మనస్విని 273వ ర్యాంకు, బదావత్ అక్షిత్ 315వ ర్యాంకు, బోర్నెల్ హర్షిత్ కుమార్ 397వ ర్యాంకు, బునేటి ఆదిత్యరెడ్డి 435వ ర్యాంకు, పవార్ కరణ్ పాండు 602వ ర్యాంకు, ఆది త్య కృష్ణ వర్రే 790వ ర్యాంకు, మంద సాత్వి క్ 803వ ర్యాంకు, తిష్య ఈశ్వర్ కొంకటి 804వ ర్యాంకు, సమృద్ధ్ భట్టాచార్య 889వ ర్యాంకు, రేవంత్ వంగాల 956వ ర్యాంకు, ప్రేమ్ కుమార్ కే 959వ ర్యాంకు, బోడ ప్రీతం 960వ ర్యాంకు, సాకేత్ రెడ్డి బొమ్మడి 990వ ర్యాంకు సాధించారు.