2 June, 2026 | 2:28 AM

శ్రీచైతన్య అద్భుత విజయగాథ

02-06-2026 01:48 AM
  1. జేఈఈ ఫలితాల్లో జాతీయ స్థాయి ర్యాంకులు
  2. మోహిత్ ఎస్‌ఎస్‌కు ఆలిండియా 4వ ర్యాంక్ 

హైదరాబాద్, జూన్ 1 (విజయక్రాంతి): సోమవారం విడుదలైన జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో శ్రీచైతన్య విద్యాసంస్థల విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారు. ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 4వ ర్యాంక్‌ను మోహిత్ ఎస్‌ఎస్ సాధించాడు. తెలంగాణ బెస్ట్ ర్యాంకర్ కూడా శ్రీచైతన్య హైదరాబాద్ విద్యార్థిదే.

ఆలిండియా ఓపెన్ కేటగిరీలో ఎం నాగసహస్ర ర్యాంక్, దర్శ్ సిక్క ర్యాంక్‌తో పాటు టాప్ 10 లోపు 3 ర్యాంకులు, టాప్ 100లోపు 4, 9, 10, 17, 21, 26, 28, 30, 31, 36, 37, 38, 40, 41, 44, 45, 52, 56, 59, 62, 64, 66, 67, 72, 73, 74, 79, 81, 87, 91, 92, 93, 95, 98, 99 ర్యాంకులతో టాప్ 100లో 35కు పైగా ర్యాంకులు, అలాగే టాప్ 1000లో 196కు పైగా ర్యాంకులు సాధించి తమ ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించారు. జేఈఈ మెయిన్ 2026లో కూడా శ్రీచైతన్య విద్యార్థులు 300/300 పరిపూర్ణ మార్కులతో రెండు ఆలిండియా మొదటి ర్యాంకులను సాధించారు.

టాప్ 100లో 27 ర్యాంకులు, టాప్ 1000లో 166 ర్యాంకులు సాధించి అసాధారణ ప్రతిభను కనబరిచారు. శ్రీచైతన్య విద్యాసంస్థల అకాడెమిక్ డైరెక్టర్, సీఈఓ సుష్మ బొప్పన విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, పరిపాలనా సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అత్యున్నత స్థాయి అకాడెమిక్ ప్రణాళికలు, విద్యార్థుల కృషి, అధ్యాపకుల అంకితభావం, పరిపాలనా బృందం సమిష్టి కృషి ఫలితంగానే ఈ అద్భుత విజయాలు సాధ్యమయ్యాయని చెప్పారు.