5 August, 2026 | 8:29 PM

ఏఎస్ఐ షేక్ జానీ భాషకు సన్మానం

05-08-2026 07:52 PM

దోమకొండ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ పోలీస్ స్టేషన్‌లో అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ఏఎస్‌ఐ)గా విధులు నిర్వహిస్తున్న షేక్ జానీ బాషా ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు మెదక్ జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం దోమకొండ పోలీస్ స్టేషన్‌లో ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. భిక్కనూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్, దోమకొండ సబ్-ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో షేక్ జానీ బాషాను శాలువాతో సన్మానించారు. దోమకొండలో ఆయన అందించిన సేవలను కొనియాడారు. నూతన విధుల్లో కూడా విజయవంతంగా సేవలందించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.