calender_icon.png 10 February, 2026 | 11:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో మున్సిపల్ ప్రచారానికి తెర 48 గంటల పాటు ఆంక్షలు అమలు

10-02-2026 12:04:38 AM

రంగారెడ్డి, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లాలోని ఆమన్ గల్, చేవెళ్ళ, ఇబ్రహీంపట్నం, షాద్నగర్, మొయినాబాద్, శంకర్‌పల్లి మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారం ముగిసింది.రాష్ట్ర ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం, పోలింగ్ ప్రక్రియను పురస్కరించుకుని జిల్లాలో కఠిన ఆంక్షలు విధిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

ఫిబ్రవరి 09 సాయంత్రం 5.00 గంటల నుండి ఎన్నికల ప్రచార కార్యక్రమాలపై నిషేధం విధిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. పోలింగ్ ముగిసే వరకు అంటే 48 గంటల పాటు ఎలాంటి బహిరంగ ప్రచారాలు నిర్వహించరాదని ఆయన స్పష్టం చేశారు.నిఘా కోసం ఎఫ్.ఎస్.టి, ఎస్.ఎస్.టి, ఎం.సి.సి బృందాలు మరియు పోలీస్ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

సంబంధిత మున్సిపాలిటీల పరిధిలో మద్యం, కల్లు దుకాణాలు 11 పోలింగ్ మూసే వరకు మూసివేయాలన్నారు. మళ్ళీ ఓట్ల లెక్కింపు జరిగే ఫిబ్రవరి 13వ తేదీన కూడా ఫలితాలు వచ్చే వరకు పై ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. పోలింగ్ జరిగే మున్సిపాలిటీలో  ఫిబ్రవరి 11  పోలింగ్ రోజు మున్సిపల్ ప్రాంతాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యా సంస్థలు, వాణిజ్య సంస్థలకు సెలవు ఉంటుందన్నారు. ఉద్యోగులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.