17 May, 2026 | 1:18 AM

వెండి దిగుమతులపై ఆంక్షలు

17-05-2026 12:13 AM

న్యూఢిల్లీ, మే ౧౬: విదేశీ మారక ద్రవ్యాన్ని నిలుపుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కఠినమైన విధానాలను అమలు చేస్తున్నది. దీనిలో భాగంగానే ఇటీవల బంగారం, వెండి దిగుమతులపై సుంకాన్ని ౬శాతం నుంచి ౧౫శాతానికి పెంచింది. అక్కడితో ఆగకుండా శనివారం మరో నిర్ణయం తీసుకున్నది.

వెండి దిగుమతుల అంశాన్ని స్వేచ్ఛా వాణిజ్య విధానం నుంచి పరిమిత విధానంలోకి తీసుకొచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం ఇకపై ఎవరైనా వెండి దిగుమతి చేసుకోవాలంటే కచ్చితంగా, వారు ప్రభుత్వ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు తక్షణం అమల్లోకి వస్తాయని కేంద్ర విదేశీ వాణిజ్య విభాగ డైరెక్టరేట్ జనరల్ నోటిఫికేషన్ సైతం విడుదల చేసింది.