24-04-2025 12:54:05 AM
ఆదిలాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ ఉపాధ్యాయుడు దుర్మరణం చెందాడు. బుధవారం వాకింగ్ కోసం వెళ్లిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు నారాయణ (65) ద్విచక్ర వాహనంపై తిరిగి ఇంటికి వెళుతున్న క్రమంలో కొమరం భీం చౌరస్తాలో ములమలుపు వద్ద టూ టౌన్, ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌ల ఎదుటనే పక్క నుంచి వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ డ్రైవర్ గమనించకపోవడంతో టిప్పర్ కింద పడ్డ నారాయణ పైనుండి ముందరి చక్రాలు వెళ్లడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందా డు. వెంటనే స్థానికులు పెద్దఎత్తున గుమిగూడిన జనం నారాయణ ను పక్కనే ఉన్న రిమ్స్ కు తరలించారు. అయితే వైద్యులు గమనించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆదిలాబాద్ అభివృ ద్ధిలో భాగం గా ఏర్పాటు చేసిన పలు సిగ్నల్ ఫ్రీ జంక్షన్‌లు ప్రజల ప్రాణాలను తీస్తున్నాయి.